5 June, 2026 | 1:02 AM

క్వార్టర్ ఫైనల్లో అర్జున్-హరిహరన్ జోడీ

05-06-2026 12:18 AM

ప్రీక్వార్టర్స్‌లోనే ఓడిన సింధు

జకార్తా, జూన్ 4 : ఇండోనేషియా ఓపెన్ సింగిల్స్ కేటగిరీలో భారత్ పోరాటం ముగిసింది. తెలుగుతేజం పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిదారి ప ట్టింది. వరల్డ్ నెం.1, సౌత్ కొరియా స్టార్ ప్లేయర్ అన్ సే యంగ్ చేతిలో సింధు 17-21,15-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొన్నటి సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఈ కొరియన్ చేతిలోనే ఓడిన సింధు.. కేవలం వారం రోజు ల గ్యాప్‌లోనే మరోసారి ఓటమిని మూటగట్టుకుంది.

అన్ సే యంగ్‌తో తలపడటం అంటే సింధుకి ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది. ఈ ఓటమితో ఆమే చేతిలో సింధు వరుసగా 10 మ్యాచ్‌లల్లో ఓడిపోయినట్లయింది. హెడ్- టు హెడ్ రికార్డులో సింధు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆమెపై గెలవలేకపోయింది. మొదటి గేమ్ గెలిచిన జో ష్లో అన్ సే యంగ్ సెకండ్ గేమ్‌లోనూ పూర్తి గా డామినేట్ చేసింది. అటు పురుషుల సిం గిల్స్‌లో ఆయుశ్ షెట్టి కూడా ప్రీక్వార్టర్స్‌లోనే ఓడిపోయాడు.

హాంకాంగ్‌కు చెందిన లీ చెక్ యూ చేతిలో  21--16, 13--21, 14--21 స్కో ర్‌తో పరాజయం పాలయ్యాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత జోడీ అర్జున్-హరిహరన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రీక్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన ఆరోన్ తాయ్,కాంగ్‌పై 16-21, 21-15, 21-19 స్కోర్ తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. తొలి గేమ్ కోల్పోయినా ఒత్తిడికి లోను కాకుండా పుంజుకుని వరుస సెట్లలో గెలుపొందారు.