కోహ్లీ ఔట్... రోహిత్ డౌట్!
ఆప్ఘన్‌తో వన్డే సిరీస్
ముంబై, జూన్ 4 : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీ అయిపోయింది. శనివారం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరగబోతోంది. అయితే వన్డే సిరీస్‌కు ముందు భారత్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే వార్త. ఐపీఎల్ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మలను బ్లూ జెర్సీలో చూడాలని ఎదురుచూ స్తున్న ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. ఆప్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమ య్యాడు.
దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో కోహ్లి అదరగొట్టాడు. సీజ న్ మొత్తం నిలకడగా రాణించిన కింగ్ గుజరాత్ టైటాన్స్‌పై ఫైనల్లోనూ దుమ్మురేపా డు.75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయి తే ఫైనల్స్‌లో తొడ కండరాల సమస్యతో కోహ్లి బ్యాటింగ్ సమయంలో కొంత ఇబ్బం ది పడ్డాడు. ఆ గాయం పెద్దది కాకుండా ఉం డేందుకు ఆప్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు
. కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుతం రుతురాజ్ గై క్వాడ్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ ఆడటంపై కూడా స్పష్టత లేదు. హిట్‌మ్యాన్ ఇం కా ఫిట్‌నెస్ టెస్ట్ పాసవలేదు. ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆప్ఘన్‌తో సిరీస్ ఆడతాడని బోర్డు వర్గా లు వెల్లడించాయి. అయితే టీమిండియా అ సిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కాటే కోహ్లీ గా యా న్ని ధృవీకరించాడు.
అలాగే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పైనా స్పందించాడు. ఫిట్‌గా ఉంటేనే రోహిత్‌ను తీసుకుంటామన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా భారత్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కోహ్లీ, రో హిత్ అప్పటి వరకూ ఫిట్‌గా ఉంటూ వరు స సిరీస్‌లు ఆడితేనే వీరిద్దరినీ పరిగణలోకి తీసుకుంటారు. తమ కెరీర్ చివరి దశలో ఉండటంతో తమ ఫిట్‌నెస్, ఫామ్ కాపాడుకోవడానికి ప్రతీ సిరీస్ కీలకమనే చెప్పాలి.






