2 July, 2026 | 4:42 PM

Breaking News

చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •   ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •  

అర్జున్ లుక్ అదుర్స్

29-07-2024 12:05 AM

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన అర్జున్ ‘విడాముయర్చి’లో మరో విభిన్నమైన పాత్రతో ఆకట్టుకోనున్నారు. అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రమే ‘విడాముయర్చి’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అర్జున్ పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఓ రోడ్డుపై నిల్చొని ఉన్నట్టు అర్జున్ స్టులిష్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన వెనుక అజిత్ షాడోతో పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇద్దరి పాత్రలకు ఉన్న లింక్ ఏంటనే ఆసక్తి రేకెత్తేలా ఉందీ పోస్టర్. ఈ చిత్రంలో త్రిషతోపాటు ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాకు ఓంప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు దక్కాయి.