calender_icon.png 11 July, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ స్టార్స్ ఒలిం‘పిక్స్’

29-07-2024 12:05:00 AM

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సందడి చేస్తోంది. చిరంజీ దంపతులతోపాటు రామ్‌చరణ్ కూడా ఈ ప్రపంచ క్రీడోత్సవంలో పలు చోట్ల సందడి చేస్తూ కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరు దంపతులు ఒలింపిక్ జ్యోతితో ఉన్న ఫొటోలు, రామ్‌చరణ్ జంట చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. రామ్‌చరణ్ తన పెంపుడు కుక్క బ్రాట్‌తో సరదాగా గడుపుతున్న క్షణంలో ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ పీవీ సింధు ఆయన్ను కలిసి మాట్లాడుతూ, కుక్కపిల్లను ముద్దు చేస్తూ కనిపించిన వీడియోను సైతం అంద రూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.