పకడ్బందీగా విత్తనాల పంపిణీ
యాదాద్రి కలెక్టర్ హనుమంత్ కే జండగే
యాదాద్రి భువనగిరి, జూన్ 7 (విజయక్రాంతి): వానా కాలం పంటల సాగు లక్ష్యానికి అనుగుణంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పకడ్బందీగా పంపిణీ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పంటల సాగు, కావాల్సిన విత్తనా లు, ఎరువులపై సమీక్షించారు. జూలై, ఆగస్టు నెలల్లో విత్తనాల అవసరం ఎక్కువగా ఉంటుందని, కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని, డీలర్ల వద్దనే కొనుగోలు చేసేలా చూడాలని తెలిపారు. విత్తన డీలర్ల రిజిస్టర్లు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, మార్క్‌ఫెడ్ అధికారి జ్యోతి, ఏడీఏ దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.






