17 July, 2026 | 5:44 PM

నిజాంసాగర్ నుంచి నేడు నీటి విడుదల

04-06-2024 02:57 AM

కామారెడ్డి, జూన్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి మంగళవారం అలీసాగర్ ప్రాజెక్టుకు 1,500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. నిజామాబాద్, బోదన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ కాలువ పైకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాలువలో దిగడం, స్నానం చేయడం, తూములు తెరవడం నిషేధమన్నారు. అతిక్ర మించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.