05-09-2025 01:15:07 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
హాలియా, సెప్టెంబర్ 4 ( విజయక్రాంతి ): ఈనెల 5న జరగనున్న వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 14వ మైలురాయి వద్ద గురువారం నిమజ్జన స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని, లైటింగ్, తాగునీరు, బందోబస్తు వంటి సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించాలని తెలిపారు. అన్ని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ శివరాం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మందడి రామ దుర్గారెడ్డి హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి , హాలియా సబ్ ఇన్స్పెక్టర్ బి. సాయి ప్రశాంత్ , అనుముల మండల ఎం.పీ.డీ.వో , ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.