calender_icon.png 5 September, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కా.. ఆదుకుంటా!

05-09-2025 01:15:53 AM

-మీ కష్టాలను ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చా

-పంటపొలాల్లో ఇసుక మేటల తొలగింపునకు ప్రత్యేక నిధులు

-రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం

-అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి

-కామారెడ్డి వరద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-రోడ్లు, ప్రాజెక్టుల మరమ్మతులకు తక్షణమే అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

కామారెడ్డి/ ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ‘అక్కా.. ఆదుకుంటా.. మీరు పడుతున్న కష్టాలను చూసేందుకే వచ్చా.. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉం టుంది’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లా వరద బాధితులకు భరోసానిచ్చారు. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలోని రైతు లు, వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు విచ్చేశారు.

ముందుగా లింగంపేట మండలంలోని లింగంపల్లికుర్దు వద్ద నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఆయనతోపాటు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క తదితరులు ఉన్నారు. రహదారులు పూర్తిగా ధ్వంసమవడంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు.

రోడ్లు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొం దించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచ నా వేయాలన్నారు. అనంతరం కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. ఇంటింటికీ వెళ్లి వరద నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సం దర్భంగా బాధితులు సుజాత, లక్ష్మీప్రసన్న వరదలతో సర్వం కోల్పోయామంటూ ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడంతో అక్కా ఆదుకుంటామంటూ అభయమిచ్చారు. వినాయక చవితి వేడుకల్లో తలమునకలై ఉన్న తమకు వరద ఊహించని విధంగా భారీ నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.14 వేల చొ ప్పున ప్రభుత్వం అందజేసిందని సీఎం వారికి వివరించారు.

తమ నివాస గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అరగంటలోనే ఇంటి చుట్టూ నీరు చేరి బయటకు వెళ్లలేని విధంగా ఆరు అడుగుల ఎత్తులో వరద వచ్చిందని చెప్పా రు. ప్రాణాలను రక్షించుకొనేందుకు బిల్డింగులు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపామని తమ మనోగతాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. జీఆర్ కాలనీ, ఎన్జీవోఎస్ కాలనీ, కౌండిన్య ఎన్‌క్లేవ్‌లోని ప్రతి ఇంటిలో బురద చేరి, ఇంట్లోని వస్తువులు పనికి రాకుండా పోయాయని తెలిపారు. 

రైతులకు అండగా ఉంటాం..

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో రైతులు తమ పంట పొ లాలు నీట మునిగాయని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని ముఖ్యమంత్రిని కో రారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సాయం చేయాలని కోరారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

జిల్లాలోని పోచా రం ప్రాజెక్టు వరదలకు తట్టుకొని నిలబడి మిమ్మల్ని కాపాడిందన్నారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వాటికి మరమత్తులు చేపడతా మని తెలిపారు. ఇసుక మేటల తొలగింపునకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ పథకం కింద పేద ప్రజలు ఇల్లు నిర్మించుకునేలా ఆర్థికసాయం అందిస్తామని భరోసానిచ్చారు. యూరియా సమస్యను కూడా త్వర లోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

వరద బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానన్నారు. లింగంపేట మండలంలో చాలా కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యామని, వాటికి వెంటనే మరమ్మ తులు చేపడతామన్నారు. భారీ వర్షాల సమయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అండగాలించారని అభినందించారు. భారీ వర్షాలతో కామారెడ్డి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుసుకొని వెంటనే ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధి షబ్బీర్ అలీ, కలెక్టర్‌తో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.

బీడీ పరిశ్రమ యజమానులు, ఇతర పరిశ్రమల యజమానులు కోఆర్డినేషన్ చేసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించు కుని బాధిత కుటుంబాలకు సహాయం చేసే లా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మిగతా సా యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో బాధితులను ఆదుకోవాలని కోరారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వరద రోజు జరిగిన పరిణామాలు, జీఆర్ కాలనీవాసులను పోలీసులు, జేసీబీల సాయంతో ప్రమాదం నుంచి బయటకు తెచ్చిన తీరును సీఎంకు వివరించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశీష్ సంగ్వా న్,ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు.

ఏరియల్ సర్వే..

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కార ణంగా దెబ్బతిన్న పంటపొలాలను హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, పొచారం ప్రాజెక్టు వంటి ముఖ్య ప్రాంతాలను పరిశీలించారు.ఎమ్మెల్యే మదన్‌మోహన్, రైతులకు జరిగిన నష్టాన్ని సీఎం కు వివరించారు. అనంతరం లింగంపల్లి కు ర్దులో ఫొటో ఎగ్జిబిషన్ లింగంపల్లి కుర్దు బ్రి డ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ వద్ద పంట నష్టం తాలుకూ ఫొటోలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. 

నష్ట నివారణ చర్యలు వేగవంతం చేయాలి  

-ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి

-ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నష్ట నివారణ చర్యలను వేగవంతం చేయాలని ఆధికారులను ఆదేశించారు.

వరద సమయంలో అప్రమత్తంగా ఉన్న అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. విపత్తు సమయంలో పాలన యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చూపుతున్న చొరవను అభినందించిన సీఎం, వరద నష్టపరిహారానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం చూపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోచారం డ్యామ్ మరమ్మతు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పునరావాసం వంటి మౌలిక అవసరాలను తక్షణమే కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమస్యలు వచ్చినప్పుడే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా జిల్లా యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, కాటిపల్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.