calender_icon.png 7 September, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై ఆగ్రహం.. రాస్తారోకో చేసిన కాలనీవాసులు

07-09-2025 12:49:56 PM

పఠాన్ చెరు, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పాటి గ్రామ శివారులో రోడ్ల దుస్థితిపై ఎంపీఆర్ అర్బన్ సిటీ కాలనీవాసులు(MPR Urban City Colony residents) ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలతో నిండిపోయిన రోడ్లు వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు, చిన్నారులు సహా వాసులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. "టాక్స్ ఎలా వసూలు చేస్తున్నారో, రోడ్లు కూడా అలాగే వేయాలి" అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేను కలిసినా, గ్రామపంచాయతీకి మెమోరాండం ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి రోడ్డుపైకి వచ్చామని వాసులు వేదన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల కారణంగా స్కూల్ బస్సులు షేక్ అవుతుండడంతో చిన్నారులకు గాయాలు అవుతున్నాయని, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబు శెట్టి, అభిషేక్, శ్రీనివాస్, రమేష్, అమూల్, సోనియా, కుసుమ కిరణ్, శ్రవణ్ కుమార్, యశ్వంత్, శ్రీకాంత్, హరీష్, శంభు లింగం, MPR అర్బన్ సిటీ కాలనీవాసులు, మిర్చి విలాస్ కాలనీవాసులు చిన్నారులతో కలిసి పాల్గొన్నారు