భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి తిరు కల్యాణ మహో త్సవములు ఈ నెల నుండి మే 4 వరకు నిర్వహిస్తున్న ందున ఈ కళ్యాణోత్సవములకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
బుధవారం ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని వి సి హాల్ నుండి వేబేక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవమునకు వస్తున్న వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకములు లేకుండా మిషన్ భగీరథ శాఖ నిరంతరం నీటి సరఫరా చేయాలని, పోలీస్ శాఖ పటిష్ట భద్రత కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్స్ సిద్ధముగా ఉంచే విధముగా ఏర్పాటు చెయ్యాలని సూచించారు.
ఆర్టీసీ కళ్యాణ మహోత్స వ ములకు అదనపు బస్సులు ఏర్పాటు చే యాలని, విద్యుత్ శాఖ సరఫరాకు ఆటంకం కలగకుండా నిరంతరం సరఫరా ఉండే వి ధంగా చూడాలన్నారు. మట్టపల్లి గ్రామపంచాయతీ దేవాలయ పరిసర ప్రాంతాలు పారిశుధ్యం చేయుటకు, ఫైర్ సర్వీస్ వారిని ఫైర్ ఇంజన్ స్టాండ్ బై చేయుటకు, సాగర్ సి మెంట్, నాగార్జున సిమెంట్ వారి సహకారంతో భక్తులకు స్నాక్స్ అందించుట, దేవ స్థానం వారు క్యూలైన్స్ ఏర్పాటు, పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరా ఏర్పాటు, వృద్ధులకి, దివ్యాంగులకు ఉచిత ఆటో ఏర్పాటు పకడ్బందీగా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ డి శిరీష, ఆర్డిఓ వి.శ్రీనివాసులు, కె భాస్కర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే భాస్కర్, నల్గొండ, దేవస్థాన అను వంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






