ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు
23-04-2026 01:47 AM
ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా
ఖమ్మం, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ చేసిన కుట్ర రాజకీయాలు పటాపంచలయ్యాయని, ఆయనపై నిందలు వేయడం సూర్యుడిపై ఉమ్మడం వంటిదని వారు పేర్కొన్నారు. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ఖ్యాతిని దెబ్బతీయలేరని తాతా మధుసూదన్, నామా హెచ్చరించారు. ఇది అధికారి కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటిదిన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ అధికారమేనని, కచ్చితంగా బదులు తీర్చుకుంటామన్నారు. ఇక నైనా తప్పుడు కేసులు పెట్టడం మానీ ప్రజలకు మేలు చేసే పనులు చేయాలన్నారు.






