23 April, 2026 | 3:36 AM

కాళేశ్వరం తీర్పు స్వాగతం.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

23-04-2026 01:45 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి):  కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని బుధవారం ఓ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, చర్యలు తేటతెల్లమయ్యాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ప్రాముఖ్యమైన నిర్మాణమని, దేశ విదేశాల ఇంజినీర్లు కూడా దీనిని ప్రశంసించారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, నాయకులపై మచ్చ వేయాలనే ఉద్దేశంతో వివిధ ఆరోపణలు చేసి కమిషన్ ఏర్పాటు చేసి, సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం జరిగిందని విమర్శించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, కుంగిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాజకీయ విమర్శలను పక్కనబెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.