8 May, 2026 | 10:15 PM

గ్రూప్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

11-12-2024 12:07 AM

* జిల్లాలో 90 కేంద్రాలు 

* అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశం

రంగారెడ్డి, డిసెంబర్10(విజయక్రాంతి): ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు 15,16వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు ఉంటాయన్నారు. మొత్తం నాలుగు పేపర్లకు అభ్యర్థులు హాజరు కానునట్లు చెప్పారు. పరీక్షల కో సం జిల్లాలో 90 కేంద్రాలను ఏర్పా టు చేశామని, మొత్తం 56,883 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు  తెలిపారు. ఆయా కేంద్రాల్లో  ఇబ్బందులు తలెత్తకుండా   అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్షల గైడ్ లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు.