calender_icon.png 22 January, 2026 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

21-01-2026 12:00:00 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

మఠంపల్లి, జనవరి 20: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం మట్టపల్లి పుణ్యక్షేత్రానికి రానున్నందున రాష్ట్ర గవర్నర్  పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మంగళవారం మట్టపల్లి లో గవర్నర్ రాక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి ఆయన పర్యవేక్షించారు.రాష్ట్ర  గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని  దేవాదాయ శాఖ  అధికారులను,ధర్మకర్తలకు సూచించారు.పోలీస్ శాఖ హెలి ప్యాడ్, ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా బందోబస్తు చూసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా మంత్రికి  ఆలయ పండితులు,ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి ఎస్పి కే నరసింహ,అదనపు కలెక్టర్ కే.సీతారామారావు,ఆర్ డిఓలు శ్రీనివాసులు, సూర్యనారా యణ, డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి,అనువంశిక  ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు,విజయ్ కుమార్, ఈవో జ్యోతి, సిఐ చరమందరాజు, మఠంపల్లి తాహశీల్దార్ మంగా, ఎంపిడిఓ జగదీష్,జిల్లా అధికారులు, సర్పంచ్ విజయశాంతి అప్పారావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.