21-01-2026 12:00:00 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం, జనవరి20(విజయక్రాంతి) :పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.రేకుర్తి 20 వ డివిజన్ లో 10 లక్షలతో యుజిడి పైపు లైన్,రోడ్డు ఫార్మేషన్ పనులు ప్రారంభించారు. శాషామహల 37 డివిజన్ లో 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా బిఆర్‌ఎస్,బీజేపీ నాయకులకు కనిపిస్తలేదని కళ్ళున్న కబోదిల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎండి తాజ్,లయక్ ఖాద్రి,అబ్దుల్ రహమాన్,నిహాల్ అహ్మద్ అస్తపురం రమే ష్,అస్తపురం తిరుమల,వెన్నంరజితా రెడ్డి,పర్వతం మల్లేశం,జక్కుల మల్లేశం,గంగిపెల్లి సంపత్, ఆవూరి లత,కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.