నయీమ్ హత్య కేసులో నిందితుల అరెస్టు
- పోలీసుల అదుపులో 8 మంది.. పరారీలో నలుగురు
- మల్కాజిగిరి సీపీ సుమతి
ఎల్బీనగర్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి) : నాగోల్ పోలీస్ స్టేషన్(Nagole Police Station) పరిధి ఆనంద్‌నగర్ చౌరస్తాలో ఉన్న సుప్రీం వైన్స్‌లో జరిగిన రౌడీ షీటర్ నయీమ్ హత్య కేసు(Nayeem murder case)లో నిందితులను 24గంటల్లోనే మల్కాజిగిరి పోలీసులు(Malkajgiri Police) అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సుమతి బుధవా రం వెల్లడించారు. నయీమ్ హత్య కేసులో పాండిచ్చేరి రాష్ట్రం యానాం ప్రాంతానికి చెం దిన సయ్యద్ రబ్బానీ(21), ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఓట్ల దిన కర్(35) పాత నేరస్తుడు,
హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్ట ఉప్పుగూడకు చెందిన ఓలిపోల్ల మహేశ్ (23), హైదరాబాద్‌లోని ఛత్రి నాక - శివగంగ నగర్‌కు చెందిన పాత నేర స్తుడు రాసుమల్ల సాకేత్(26), హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన పాత నేరస్తుడు అల కుంట వెంకట్ (22), హైదరాబాద్‌లోని చాం ద్రాయణగుట్ట ఉప్పుగూడకు చెందిన కొడి గంటి రాఘవేం దర్ అలియాస్ రఘు(27), హైదరాబాద్‌లోని ఛత్రినాకకు చెందిన వల్లపు దాసు చరణ్‌గౌడ్ (18), మహ్మద్ బద్రుల్లా హుస్సేన్(44), ఖమ్మం జిల్లాకేంద్రానికి చెం దిన తొడేటి వెంకటేశ్ ను అరెస్టు చేశారు.
కీలక నిందితుడు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రౌడీ షీటర్ కనకం ఉమామహేశ్(32), మహ్మద్ ఇస్మా యిల్ జాబీ, భోలే, కార్తీక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి వేట కొడవలి, ఇనుపరాడ్, టయోటా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కున్నారు. కాగా నయీమ్, కనకం ఉమా మ హేశ్, సయ్యద్ రబ్బానీ, ఒట్ల దినకర్ చిన్న నాటి స్నేహితులు. కొంతకాలంగా వీరి మధ్యన విభేదాలు ఏర్పడడంతో నయీమ్ తమను నిత్యం బెదిరిస్తూ దూషించేవాడని నిందితులు చెప్పినట్లు పోలీసులు పేర్కొ న్నా రు.ఈ నేపథ్యంలో నయీంను హతమార్చేం దుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.