1 September, 2026 | 4:09 PM

మొక్కల పెంపకంతోనే కాలుష్య నివారణ

01-09-2026 03:08 PM

మెట్‌పల్లి, సెప్టెంబర్1(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ(Pollution control) సాధ్యం అవుతుందని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి(Municipal Chairman Mailarapu Limbadri) అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ(Van Mahotsav ) కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పంతొమ్మిది, ఇరవై ఒకటవ వార్డులలో ఘనంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మైలారపు లింబాద్రి ఆయా వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ(Plant distribution) చేసి మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఆయన కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్లు బోడ్ల ఆనంద్, ఖాజా అజీమ్ ప్రజా ప్రతినిధులు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.