1 September, 2026 | 3:52 PM

రేపు మునిపల్లి జనరల్ బాడీ సమావేశం

01-09-2026 03:20 PM

మునిపల్లి సెప్టెంబర్ 1(విజయక్రాంతి): ప్రతి 45రోజులకు ఓసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం రేపు ఉదయం 10:30 గంటలకు మునిపల్లి(Munipalli) ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో(MPDO) శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చే అధికారులు విధిగా హాజరు కావాలన్నారు.ఇదిలా ఉండగా గత నెల 22వ తేదీ నిర్వహించిన సర్వే సమావేశంలో కొన్ని శాఖల అధికారులు గైర్హాజర్ కావడంతో సమావేశాన్ని సభ్యులు బహిష్కరించి వాయిదా వేశారు.

అయితే ఈ సమావేశానికైనా అన్ని శాఖల అధికారులు హాజరవుతారా..? లేక గత జనరల్ బడిలో జరిగిన మాదిరిగానే కొన్ని శాఖల అధికారులు డుమ్మా కొడతారా..?అనే విషయంపై ఉత్కంఠ నెలకు ఉన్నది. గత సమావేశంలో డుమ్మా కొట్టిన అధికారులపై చర్యలు తీసుకున్నందుకు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని మండల ప్రత్యేక అధికారి హెచ్చరించిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఎంత మంది డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టిన అధికారులపై చర్యలు తీసుకున్నారా..? చూద్దాం. కాగా రేపు జరిగే సర్వ సమావేశంలో అన్ని శాఖల అధికారులు హాజరవుతారా అనే విషయం రేపు తేలనుంది.