calender_icon.png 23 February, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్మెట్ ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి

23-02-2026 08:33:36 PM

మితిమీరిన వేగం.... ప్రాణాలకే ప్రమాదం

జవహర్ నగర్ లో ఎరైవ్ ఏ లైవ్ కార్యక్రమం

జవహర్ నగర్,(విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్ ధరించండి ప్రమాదాలను నివారించడని, మితిమీరిన వేగం, ప్రాణాలకే ప్రమాదమని జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో భాగంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో సోమవారం ఎరైవ్_ఏ లైవ్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్  చేపట్టారు.

ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదయ్య హాజరై మాట్లాడుతూ... ట్రాఫిక్ నిబంధనలు పాటించి శుభప్రదమైన ప్రయాణానికి నాంది పలకండని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రజలు ప్రయాణాలలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మానవుల ప్రాణాలు విలువైనవని లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్ ఎక్కారంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి వల్లే రోడ్డు ప్రమాదాలు అధిక శాతం చోటు చేసుకుంటున్నారు. దీనిని నివారించేందుకు తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని తెలిపారు.

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ ట్రాఫిక్ నిబంధనల ను చలాన్లను తప్పించుకోడానికి కొంతమంది తమ వాహనం నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని తెలిపారు. అంకెలు మార్చడం నెంబర్ ప్లేట్లను మాస్కులు తొడగడం, రంగు పూయడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనం నడుపుతూ బయటకు వస్తే తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే అర్హత లేని వారికి వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ ఇంద్రారెడ్డి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వేణుమాధవ్, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.