30 May, 2026 | 10:50 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం

13-04-2026 04:18 PM

సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ

సత్తుపల్లి ఆర్టీసీ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్

సత్తుపల్లి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యత అని, భద్రతా నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా నడుచుకున్నట్లయితే ప్రమాదాలను నివారించవచ్చాని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం సత్తుపల్లి డిపోలో ఎరైవ్- ఎలైవ్ ప్రోగ్రాంను స్థానిక ఎంవిఐ రాజశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ జి.అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం సుఖమైన శుభప్రదం అని అన్నారు.

ఆర్టీసీలోనే సుచిక్షితులు అయిన డ్రైవర్లు ఉంటారు అని సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలి అని డిపో మేనేజర్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం సత్తుపల్లి ఆర్టీసీ ఆధ్వర్యంలో అరైవ్‌-అలైవ్‌ క్యాంపెయిన్ లో భాగంగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్‌ నియమాలపై బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా ఆరైవ్‌ ఆలైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వాహన దారుల నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని హెల్మెట్, సీటు బెల్ట్ ధరిస్తే ప్రమాదాలను కొంతమేర నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనాలను నడప రాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముందుగా సత్తుపల్లి డిపో నుండి ప్ల కార్డులు చేతబూని, రోడ్డు భద్రత స్లొగన్స్ చేస్తూ రింగ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం డిపో గేటు వద్ద ఉద్యోగులతో కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి అశోక్,  ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్  పి.ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, ఏడీసీలు, సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.