14-01-2026 12:37:14 AM
జిల్లావ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నేటి నుండి జనవరి 24 వరకు
అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు.. ఉద్యమంలా సాగాలి.
ప్రతీ కుటుంబం ఆనందముతో జీవించాలి:
ఎస్పి యం రాజేష్ చంద్ర
కామారెడ్డి, జనవరి 13 (విజయక్రాంతి): దేశములోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా అరైవ్ అలైవ్‌అనే ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిదిలో ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. జనవరి 13 నుండి 24 వరకు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాలలో మొదటి రోజు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, పాల్గొని ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గ్రామస్థులకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మన కామారెడ్డి జిల్లాలో ఉగ్రవాయి గ్రామంలోనే ఈ మహత్తర కార్యక్రమం ఎరివ్ అలైవ్ అనేది ప్రారంభించడానికి ఒక ముఖ్య కారణం ఉందన్నారు.
ఉగ్రవాయి గ్రామస్తులు గత 11 నెలలుగా ఒక్క రోడ్డు ప్రమాద మరణం అనేది జరగుండా జాగ్రత్తలు తీసుకొని స్పూర్తి దాతలుగా నిలిచారు.అలాగే ఈ కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలి, ప్రతి ఒక వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సబ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలి. ఉగ్రవాయి గ్రామంలోనే రోడ్డు ప్రమాద సంఘటనలో మరణం సంభవించి వారి కుటుంబ సబ్యుల బాధలను తెలియజేసింది అని అలాంటి పరిస్తితి మరొక కుటుంబములో జరగకుండామన అందరమూ రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు, అవి మన నిర్లక్ష్యం, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల జరుగుతాయి. హెల్మెట్ ధరించడం అనేది కేవలం చలానాలనుండి, చట్టం నుండి తప్పించుకోవడానికి కాదు, అది మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని ప్రతీ ఒక్క వాహనదారుడు గ్రహించి విధిగ దరించాలి. మద్య సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలి. మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, మరియు రాంగ్ దిశలో డ్రైవింగ్ ఎట్టి పరిస్తితులలో చేయవద్దని ఎస్పీ గారు సూచించారు.
సేఫ్టీ ఫస్ట్ మీ కోసం మీ కుటుంభ సబ్యులు ఇంటివద్ద ఎదురుచూస్తున్నారు అన్న విషయం గుర్తించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించండి అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు గ్రామ సభలలో ప్రతీ ఒక పోలీసు అధికారి పాల్గొని నిర్వహించినారని ఇలా ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అని ఎస్పీ గారు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ రామన్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్ గౌడ్, ఉగ్రవాయి సర్పంచ్ మహేష్, ఉపసర్పంచ్తో పాటు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.