calender_icon.png 14 January, 2026 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

14-01-2026 12:35:19 AM

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మహబూబాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి 59.62, కోట్లు మంజూరు చేసి 24. కోట్ల 13 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో గల ఇల్లందు రోడ్ లోని 17వ వార్డులో రూ. 55 లక్షల విలువ కలిగిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పైపు లైన్ నిర్మాణం,

అదే విధంగా బేతోలు పరిధిలోని 6వ వార్డులో రూ. 50 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, అలాగే రూ. 7 కోట్లతో బంధం చెరువు సుందరీకరణ పనులు, రూ. 64 లక్షల వ్యయంతో 19వ వార్డులోని పలు అభివృద్ధి పనుల కోసం, అంతే కాకుండా రూ. 40 లక్షల వ్యయంతో 33వ వార్డు, తహసిల్దార్ కార్యాలయం వద్ద అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మూడు కోట్లతో 23వ వార్డులో అంతర్గత రోడ్లు, రూ. 59 లక్షల వ్యయంతో జంక్షన్ పరిధిలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం,

రూ. 12 కోట్ల వ్యయంతో 11వ వార్డులోని నందన గార్డెన్ రోడ్డు నందు హస్తినాపురం కాలనీ అభివృద్ధి, వరద ముంపు నివారణకు మురుగు కాలువల నిర్మాణ పనులు, రూ. 50 లక్షల వ్యయంతో ఇల్లందు రోడ్డులో గల 6, 17వ వార్డు జ్యోతిరావు ఫూలే జంక్షన్ ప్రాంతం అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, రూ. కోటి రూపాయల వ్యయంతో 32, 18వ వార్డులలో బొడ్రాయి సెంటర్ ప్రాంతం అభివృద్ధి పనులకు, రూ. కోటి వ్యయంతో 13, 14వ వార్డుల్లో మోర్ సూపర్ మార్కెట్ వద్ద బ స్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలు వేసి, పనులను ప్రా రంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తోందన్నా రు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.