18 June, 2026 | 3:19 AM

పాకిస్థాన్ గోల్డ్ మెడలిస్టు కు బర్రె ను బహుకరించిన మామ

17-08-2024 02:33 PM

లాహోర్:  పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌ లో జావెలిన్ త్రో ఈవెంట్లో  స్వర్ణం సాధించిన తర్వాత అర్షద్ నదీమ తాలూకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్న అర్షద్ నదీమ్ ను అతడి మామ ఇచ్చిన గేదె బహుమతి గురించి వ్యాఖ్యాత ప్రశ్నించారు. అయితే తన మామగారు తనకు కానుకగా ఇచ్చిన అపూర్వ కానుక ను ట్యాగ్ చేస్తూ.. ఆయన తనకు నాలుగైదు ఎకరాల మాగాణి ఇస్తాడనుకున్నా.. ఎందుకంటే మామ చాలా రిచ్ అన్నాడు. అర్షద్ తన మామగారిని అదే అడగమని  భార్య అయేషా తో చెప్పా కాని ఆమె తన తండ్రి ని అడగ లేదు ఆయన ఇవ్వలేదు.. బహుశా అడిగితే ఇచ్చేవారేమో అంటూ జోక్ చేశారు. అయినా ప్రపంచంలో  ఏ స్టార్ అథ్లెట్‌కు అతని మామ ఒక గేదెను బహుమతిగా ఇచ్చి ఉండరేమో.. చూడండి నేనెంత అదృష్ట వంతుడైన అల్లుడినో.. ఇలాంటి మామ ఎవరికీ దొరకడు.. అంటూ నదీమ్ అతని భార్య సమక్షంలో మామ బహుమతి గురించి చమత్కరించాడు. 

పౌర సన్మానాలు అవార్డులు,రివార్డులు..

దేశ ప్రతిష్టను పెంచిన గోల్డ్  మెడలిస్టు అర్షద్ కు పాకిస్థాన్ లో అనేక గౌరవాలు,  పౌర సన్మానాలు అవార్డులు,రివార్డులు వచ్చిపడుతున్నాయి. జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల విజయానికి గుర్తుగా ఏం చక్కా..92.97 నంబర్ ప్లేటున్న హోండాసివిక్ కారును  పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ తొలి మహిళా ముఖ్య మంత్రి మరియం నవాజ్.. అర్షద్ కు బహుకరించారు. 10 కోట్ల నగదు బహుమతి సైతం ఇచ్చారు.