18 June, 2026 | 1:55 AM

కర్ణాటక సీఎంపై విచారణకు అనుమతిచ్చిన గవర్నర్

17-08-2024 03:27 PM

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతిచ్చారు. ముడా భూకుంభకోణంలో సిద్ధరామయ్యపై ఆరోపణలు కలకలం సృష్టిస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కర్ణాటక సీఎం విచారణపై గవర్నర్ అనుమతిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.