హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి
హైదరాబాద్: హబ్సిగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢికోన్నడంతో ఆటో ముందు ఉన్న ఆర్టీసీ బస్సు కిందకు వెళ్లిపోయంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ఆటోను తొలగించారు.
ఆటో డ్రైవర్ తోపాటు విద్యార్థిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మరోక ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని నాచారంలోని గౌతమి మోడల్ స్కూల్ కు చెందిన సాత్విక(15) పదోతరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. గుండెలు అలిసేలా రోదించడం అందరిని కలిచివేసింది.






