21-01-2026 12:54:40 AM
హనుమకొండ, జనవరి 20 (విజయక్రాంతి): సౌత్ జోన్ మహిళా ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు యూనివర్సిటీ ఆరట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినీలు డి. శ్యామల, ఝాన్సీలు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి తెలిపారు. మద్రాస్ లోని అన్నా యూనివర్సిటీలో ఫిబ్రవరి రెండో తేదీ నుండి సౌత్ జోన్ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో కళాశాల విద్యార్థినులు పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.టి.బి.టి. ప్రసాద్, డాక్టర్ పుల్లా రమేష్, డాక్టర్ సుచరిత, డాక్టర్ సంజీవ్తో పాటు కళాశాల అధ్యాపకులు విద్యార్థినులను అభినందించి, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకు, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆర్ట్స్ కళాశాల సంస్కృత విభాగాధ్యక్షునిగా హరికుమార్ నియామకం
కాకతీయ విశ్వవిద్యాలయం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంస్కృత విభాగ నూతన అధ్యక్షునిగా వేదాంతం హరికుమార్ను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో ఆయన ఒక సంవత్సరం పాటు కొనసాగనున్నారు. సంస్కృత విభాగంలో విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, విద్యా ర్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, డాక్టర్ చందర్, డాక్టర్ పుల్ల రమేష్, ఇతర అధ్యాపకులు వేదాంతం హరికుమార్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.