ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్ష
రాజన్న సిరిసిల్ల, జూన్ 1, (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగా లని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. వేములవాడలో నిరహించిన ఆర్యవైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆది శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాచైర్మన్ కాల సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది మట్లాడుతూ సమాజంలో ఆర్యవైశ్యుల పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రభుతపరంగా ఆర్యవైశ్యులకు అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితులు పాల్గొన్నారు.
తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): ధాన్యం తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకూసాపూర్‌లోని అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకాల్లో వ్యత్యాసాలపై రైతులు ఫిర్యాదు చేశారని, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.






