17 July, 2026 | 10:06 PM

11 మంది సారా తయారీదారులపై కేసులు

02-06-2024 02:15 AM

సారా బట్టీల ధ్వంసం

వరంగల్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (విజయక్రాంతి): నాటుసారా తయారు చేసినా, అమ్మినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా శనివారం మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తండాలో దాడు లు నిర్వహించారు. ఈ దాడుల్లో 53 లీటర్ల నాటుసారా, 2,700 లీటర్ల బెల్లం పానకం, పది క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. సారా బట్టీలను ధ్వంసం చేశారు. భూక్య అరుణ, బానోత్ విజయ, అజ్మీరా కమిలి, నూనావత్ లలిత, నూనావత్ సునీ త, భూక్య కవిత, భూక్య మల్సూర్, భూక్య సంధ్య, భూక్య చిల్కి, అజ్మీరా సత్తి, భూక్య ఉమపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ డీపీఈవో కిరణ్, మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్,  డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సారయ్య, ఎక్సైజ్ సీఐ చిరంజీవి, ఎస్సైలు పాల్గొన్నారు.

గుడుంబా స్థావరంపై దాడి

బెల్లంపల్లి: నెన్నెల మండలంలోని ఆవడం శివారులో శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుడుంబా స్థావరంపై దాడి చేశారు. 11 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతోపాటు వెయ్యి లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మందమర్రి మండలం పొన్నారానికి చెందిన ముప్పిడి శ్రీనివాస్‌ను  అదుపులోకి తీసుకుని విచారించగా.. పొన్నారానికి చెందిన బొలిశెట్టి జనార్దన్, ఆవడంకు  చెందిన బీ తార  వద్ద పనిచేస్తున్నట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేశామని.. తార, జనార్దన్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.