calender_icon.png 29 July, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి

29-07-2025 12:52:57 AM

 ఆత్మీయసమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, జులై 28 (విజయ క్రాంతి): 1944 లో స్థాపించిన ఆర్యవైశ్య సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందని ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకుమారు పేరు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో సోమవారం జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లా డుతూ  అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలం దించడంలో వైశ్యులు ముందుంటారని ఆయన గుర్తు చేశారు.

సంపద సృష్టించడంలో కూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు వైశ్యులు చెల్లిస్తున్నారని ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా వారి సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు. వివిధ రంగాలలో ముందున్న వైశ్యులు ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సంఘ అభివృద్ధిలో కృషి చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లేందుల ప్రభాకర్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంఘ పెద్దలు  పాల్గొన్నారు.