calender_icon.png 18 July, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు రాజకీయాలను శాసించాలి

18-07-2025 05:36:14 PM

రాజకీయరనభేరి వ్యవస్థాపకులు కాచం సత్యనారాయణ

సూర్యాపేట,(విజయక్రాంతి): ఆర్యవైశ్యులు కేవలం సమాజసేవలోనే కాకుండా రాజకీయాలు శాసించే విధంగా రాణించాలని రాజకీయరన బేరి వ్యవస్థాపకులు, వైశ్య వికాసం పత్రిక ఎడిటర్ కాచం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గ  ఆర్యవైశ్య మహాసభ సంఘ సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత పాలకులు కేవలం ఆర్యవైశ్యుల ఓటు బ్యాంకును మాత్రమే వాడుకుని, పబ్బం గడుపుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు కూడా కేవలం, ముఖ్యమంత్రిలకు తొత్తులుగా మారి, ఆర్యవైశ్యుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల ఐకమత్యంతో ఉండి, ఆర్యవైశ్యుల ప్రజా బలాన్ని బట్టి, ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచ్లకు పోటీలో సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఎంతోమంది వీరులను కన్న బిడ్డల స్ఫూర్తితో, ఆగస్టు 3 హైదరాబాదులో జరుగు రాజకీయ రణభేరి కార్యక్రమానికి వేలాదిగా ఆర్యవైశ్యుల స్వచ్ఛందంగా తరలివచ్చి, రాజకీయాలను శాసించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం రాజకీయరనబెరి పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.