calender_icon.png 18 July, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అప్‌డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు

18-07-2025 05:43:58 PM

ఈ 15 రోజుల వ్యవధిలో ఆధార్ అప్డేషన్ కు కావలసిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి

ఆధార్ అప్‌డేట్ ప్రత్యేక క్యాంపుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అప్‌డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఆధార్ కార్డు పొందేందుకు మీసేవ ద్వారా అడ్రస్ తో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డు ఉండాలన్నారు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం ఓటర్ ఐడి లేదా  పాస్ పోర్ట్  లేదా నివాస సర్టిఫికెట్, బ్యాంకు పుస్తకం/ పోస్టల్ బుక్ తో సహా అటెస్టడ్ దరఖాస్తు ఫారం ఉండాలన్నారు.

ఆధార్ కార్డులు పేరు స్పెల్లింగ్ పొరపాట్ల సవరణకు ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా ప్యాన్ కార్డు లేదా ఎస్ఎస్సీ మార్కుల మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మైనర్ ఐతే బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, పెళ్లి తర్వాత పేరు మార్పు కోసం సబ్ రిజిస్టర్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటో, ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని, పూర్తిగా పేరు మార్పు కోసం గెజిటెడ్ చేసి ఉండాలని, ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికెట్, 21 సంవత్సరాల పైబడిన వారికి ఫోటోతో కూడిన మార్కుల మెమో లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలని పేర్కొన్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం బయట  100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఈ క్యాంపులో అవసరం లేదన్నారు. ఆధార్ అప్డేషన్ అవసరం ఉన్నవాళ్లు ఈ 15 రోజుల వ్యవధిలో కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటుచేసే ఆధార్  అప్డేట్ క్యాంపు ను అవసరమైన ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.