1 April, 2026 | 7:52 PM

మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు

01-04-2026 06:19 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నివేదిత లచ్చాది మొదటిసారిగా గెలిచిన అనంతరం బుధవారం తుంగతుర్తి మండల ఆర్యవైశ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధితోపాటు ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య, బండారు దయాకర్, ఈగ లక్ష్మయ్య, ఓరిగంటి శ్రీనివాస్, తల్లాడ కేదారి, గోపారపు సత్యనారాయణ, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు పోలవరపు సంతోష్, ఓరుగంటి సుభాష్, ఈగ సత్తయ్య, గుండా శ్రీనివాస్, తల్లాడ శ్రీను, ఈగ శ్రీనివాస్ ,ఈగ సత్తయ్య, బుద్ధ నాగన్న, రాజేంద్రప్రసాద్, తల్లాడ నారాయణ తదితరులు పాల్గొన్నారు.