calender_icon.png 2 June, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండోరాతో నటిగా..

01-06-2025 12:03:34 AM

సింగర్ అదితి భావరాజు నటిగా వెండితెరపై సందడి చేయనున్నారు. సంగీత ప్రియుల ఆదరణ పొందిన ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలను పాడిన అదితి.. నటనా ప్రతిభను సైతం ప్రదర్శించనుంది. ‘దండోరా’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో ఇంకా శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు.

ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కే రాబిన్; సినీమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి; ఎడిటర్: సృజన అడుసుమిల్లి; ఆర్ట్: క్రాంతి ప్రియం.