17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శంబాలలో కాంచనమాల

01-06-2025 12:01 AM

యంగ్ హీరో ఆదిసాయికుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు ఆసక్తిని పెంచుతోంది.

తాజాగా మరో ఇద్దరి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఇంద్రనీల్ పోషించిన మల్లేశ్ పాత్ర, శైలజప్రియ పోషించిన కాంచనమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ థ్రిల్లర్ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.