2 April, 2026 | 3:18 AM

మంగాపురంలో స్వతంత్రబాబుగా..

02-04-2026 12:00 AM

‘ఆర్‌ఎక్స్100’, ‘మంగళవారం’ చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్వినిదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో నరేశ్ వీకే కూడా ఓ ముఖ్యపాత్రలో అలరించనున్నారు.

నరేశ్ ఇందులో స్వతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారని వెల్లడిస్తూ, ఆ పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక చేతిలో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని డాన్స్ వైబ్‌లో కనిపించిన నరేశ్ లుక్ ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో బెంచ్ మార్క్ క్యారెక్టర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; ఎడిటర్: మాధవ్‌కుమార్ గుళ్లపాటి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.