6 July, 2026 | 3:58 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

జనులారా వినరారా..

29-05-2025 12:00 AM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమా జూన్ 28న విడుదల కానుంది. ఇటీవలే యూఎస్‌లో ఈ మూవీ ప్రమోషన్స్‌ను ముగించుకొని తిరిగి వచ్చారు హీరో మంచు విష్ణు.

తాజాగా ఈ సినిమా కోసం మోహన్‌బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళహస్తి’ పాటను విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన గీతాన్ని కాశీ విశ్వనాథుని ఆలయంలో ఆవిష్కరించగా నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా పాల్గొన్నారు.

‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’ అంటూ సాగుతోందీ పాట. రాబోయే తరాలకు ‘శ్రీకాళహస్తి’ ఆలయ విశిష్టతకు చిహ్నంగా ఉంటుందీ గీతం. అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించి, తమ నృత్యంతో ఆకట్టుకున్నారు.ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, స్టీఫెన్ దేవస్సీ స్వరాలు సమకూర్చారు.