15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బీటెక్‌లో మిస్సయ్యానే..

19-09-2024 12:51 AM

హీరో విశ్వక్ సేన్ మరో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ‘మెకానిక్ రాకీ’ పేరుతో దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్-గా ‘ఓ పిల్ల’ అనే సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘ఓ పిల్లో బీటెక్‌లో నే నిన్నే మిస్సయ్యానే.. ఇవ్వాలో రేపట్లో నిన్నే సెట్ చేస్తానే..’ అంటూ పెప్పీ బీట్స్‌తో సాగుతోందీ పాట. బీ-టెక్ సమయంలో తను ప్రేమించిన అమ్మాయికి వ్యక్తం చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో మళ్లీ ఆమెతో కలిసే అవకాశం రావడంతో ఆనందపడ్డ క్షణాల్లో ఇలా పాటందుకున్నట్టు తెలుస్తోంది.

కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్‌కు జేక్స్ బెజోయ్ స్వరాలు సమకూర్చగా, నకాష్ అజీజ్ పాడారు. ఈ పాటలో విశ్వక్, మీనాక్షి బ్యూటీఫుల్‌గా కనిపించారు. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ ముఖ్య తారాగణం. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల కానుంది.