13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

స్వలింగ ప్రేమికులుగా!

21-02-2026 02:01 AM

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న దక్షిణాది బ్యూటీ రష్మిక మందన్న. విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కనిపిస్తూ అందరి మెప్పు పొందుతోంది. అయితే, వీరిద్దరూ కలిసి నటిస్తున్న ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్తల ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. ఇందులో కృతి సనన్, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో వీరిద్దరి పాత్రల గురించి బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్త భారతీయ సినీ జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలో కృతి, రష్మిక స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నారట. ఈ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ఆసక్తికర చర్చకు తెర తీసింది. దర్శకుడు హోమీ అదజానియా దీన్ని ముక్కోణ ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారట. జనవరి 31న షూటింగ్ పూర్తయిందని గతంలో దర్శకుడు వెల్లడించారు.  త్వరలోనే దీని విడుదల తేదీని ప్రకటించనున్నారు.  2012లో దీపికా పదుకొణె, డయానా, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాక్‌టెయిల్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే ఈ ‘కాక్‌టెయిల్ 2’.