13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆకర్షిత ఆరంభం

22-02-2026 12:00 AM

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త సినిమా ‘ఆకర్షిత’. త్రిగుణ్ హీరోగా పదినే కుమార్ హీరోయిన్‌గా నటించనున్నారు. రాజ్‌కుమార్  కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేశ్, రవివర్మ, ప్రియ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు నిర్మాతలు. ఈ చిత్రానికి షేక్ హజారత్ (వలి) కెమెరామెన్‌గా, ఎస్ అర్జున్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు.

రోహిత్ బాబు సంగీతం సమకూర్చనుండగా, పూర్ణాచారి, తిరుపతి సాహిత్యం అందించనున్నారు. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి నిర్మాతలు వంశీ నందిపాటి, దామోదర ప్రసాద్, సీ కళ్యాణ్, జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు వేణు స్వామి అతిథులుగా హాజరయ్యారు.