calender_icon.png 22 December, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ లో హీరోయిన సమంత సందడి

21-12-2025 10:49:32 PM

టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌నుప్రారంభించారు. అక్కడ చీరల కలెక్షన్లు చూసి మురిసిపోయారు.  ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు ఈ శారీస్ కలెక్షన్లే అంటూ వ్యాఖ్యానించారు.  భారతీయ హస్తకళలు , చేనేత చీరల ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని, ఇది అందరికీ గర్వకారణమని చెప్పుకొచ్చారు.

సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు మరియు సంప్రదాయ నెయ్యుల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు తయారు చేయిస్తామన్నారు. కొత్తగా ప్రారంభించిన సిరిమల్లె శారీస్ షోరూమ్‌లో కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, పండుగల కలెక్షన్లు, హ్యాండ్లూమ్ శారీలు మరియు ఆధునిక ఎథ్నిక్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.