15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్పీకర్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

28-02-2026 11:27 AM

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker) తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) స్పీకర్ విచారణకు హాజరయ్యారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ నేడు విచారణ జరుపుతున్నారు. కడియం శ్రీహరి తరుపు సాక్షాలను స్పీకర్ నమోదు చేయనున్నారు. 

ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA KP Vivekananda) అడ్వొకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అటు ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్ టర్న్‌కోట్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే తరపున ఆయన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులు దానం నాగేందర్ న్యాయవాదుల నుండి కొంత సమాచారం కోరినట్లు తెలిసింది.