4 August, 2026 | 6:26 PM

ఆగస్టు 10 జైల్ భరోను జయప్రదం చేయాలి

04-08-2026 05:14 PM

నారాయణరావుపేట పీహెచ్‌సీలో ఆశ వర్కర్ల వినతిపత్రం

 కార్మికులు, రైతులు పాల్గొనాలని పిలుపు

సిద్దిపేట రూరల్: ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ యూనియన్ సభ్యులు హెచ్‌సీఓ సరస్వతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు బిట్ల శ్రీలత మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని, రైతులకు మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు, ఉపాధి భద్రత కల్పించాలని కోరారు. మండలంలోని ఆశ వర్కర్లు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.