4 August, 2026 | 6:04 PM

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

04-08-2026 05:16 PM

– ప్రత్యేక పూజల్లో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

నర్సాపూర్: కౌడిపల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి సర్పంచ్ కృష్ణ గౌడ్, నాయకులు సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.