26 నుంచి ఆషాఢ బోనాలు
- వచ్చే నెల 24 వరకు నిర్వహణ
గోల్కొండ ఆలయంలో తొలిబోనం
ఏర్పాట్లకు 20 కోట్లు మంజూరు చేశాం
అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలి
సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఈ నెల 26 నుంచి జూలై 24 వరకు ఆషాడ మాస బోనాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవా ణా, శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీ ఆర్ హెచ్ ఆర్‌డీ లో బో నాల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల కో సం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నెల 26న గోల్కొం డ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభమవు తాయ ని చెప్పారు. జూన్ 29న సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కో లు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహిస్తామన్నారకు.
జూలై 1న బల్కంపేట శ్రీఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రా ల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సిం హవాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, చార్మి నార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ దర్బా ర్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీనల్ల పోచ మ్మ దేవాలయం, బల్కంపేట్ శ్రీఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో బోనాలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ర్ట ప్రభుత్వం తరఫున 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని తెలిపారు. ఏనుగు అంబారీ ఊరేగింపు జూలై 14న శ్రీఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, 20న శ్రీనల్ల పోచమ్మ దేవస్థానం సబ్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం అంబారీ ఏను గు ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా ప్రధాన దేవాలయాల వద్ద రోడ్లకు మరమ్మత్తులు చేపట్టవలసిందిగా, దేవస్థాన పరిసరాలు పరిశుభ్రంగా, హైజానిక్‌గా ఉండేలా శానిటేషన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పండుగలకు ముందే చెక్కులు క్లియర్
దేవాలయాలకు ఇచ్చే చెక్కులు రెవెన్యూ, ఎండోమెంట్ కో ఆర్డినేట్ చేసుకొని పండుగలకు ముందే పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. అనంతరం దేవాలయాల కమిటీలతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ , డీజీపీ జితేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మే యర్ శ్రీలత శోభన్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్,
స్పెషల్ సెక్రటరీ వికాస్‌రాజ్, దేవాదాయ శా ఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, అడిషనల్ డీజీ ఎంఎం భగవత్, జీహెచ్‌ఎం సీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ అశోక్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అను దీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, టీఎస్‌ఎస్ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్ పాల్గొన్నారు.






