17 April, 2026 | 7:02 AM

ఉపాధ్యాయుల సర్దుబాటు పొడగింపు

11-06-2025 01:16 AM

నాగల్‌గిద్ద, జూన్ 10:  ఉపాధ్యాయుల సర్దుబాటు ఈనెల జూన్ 12 లోపే చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను  రాష్ట్ర సంఘ అభ్యర్థన మేరకు ఈనెల 15 వరకు పొడిగించడంలో ఎమ్మెల్సీ  పింగిలి శ్రీ పాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  గుండు లక్ష్మణ్, పులగం దామోదర్ రెడ్డి కృషి చేసినందుకు  నాగల్ గిద్ద మండల పక్షాన పిఆర్టియు అధ్యక్షులు శేరికర్ రమేష్, కార్యదర్శి నాగనాథ్, జిల్లా సహద్యక్షులు చెరి విజయేందర్  రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా శేరికర్ రమేష్ మాట్లాడుతూ అప్పటి వరకు మా మండలంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులు కలిసి ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యను గణనీయంగా పెంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.