11 March, 2026 | 3:15 AM

మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి

11-06-2025 01:18 AM

కొండపాక, జూన్ 10: వానాకాలం సాగుకు రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఐసిఏఆర్, సిఆర్‌ఐడిఏ సీనియర్ శాస్త్రవేత్త  డా.పుష్పాంజలి సూచించారు. జిల్లా ఏరువాక కేంద్రం, తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కుకునూరు పల్లి మండలంలోని మేదినీపూర్ రైతు వేదికలో వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించి, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వివిధ రకాల పంటల్లో సాగునీటిని ఆధాచేసి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రత్యామ్నాయ పంటల వివరాలను చెట్ల పెంపకం లాంటి మేలైన పద్ధతులను వివరించారు.

అధిక దిగుబడి నిచ్చే మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలన్నారు. వరి కోయ్యాలను కాల్చవద్దని, పచ్చి రొట్టె ఎరువులు, జీలుగా, జనము, పిల్లి పెసర్లను వేసుకోవాలని సూచించారు. సాగు ఖర్చు తగ్గించుకొని, సేంద్రియ ఎరువులు వినియోగించాలని నేల సమతుల్యతను కాపాడాలని కోరారు.

కొండపాక ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సాగు ఖర్చు తగ్గించుకొని, అధిక దిగుబడులు సాధించాలని కోరారు. రైతులు విత్తనాలు పురుగుమందుల ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, డాక్టర్ పల్లవి, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ శ్రీనివాస్, ఏవో గోవిందరాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్యశ్రీ, శ్రీహరి, పంచాయతీ సెక్రటరీ రవళిక, రైతులు పాల్గొన్నారు.