calender_icon.png 18 July, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ఆషాఢం కిలో సేల్

18-07-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): ఆషాఢమాసం పవిత్రతను దృష్టిలో ఉంచుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘షాపింగ్ కిలోల్లో.. సంతో షం టన్నుల్లో’ క్యాప్షన్‌తో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రకటించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కంచిపట్టు చీరలపై అందిస్తున్న ‘1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం’ పథకం ఆషాఢమాస కొనుగోలు ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని రకాల వస్త్రాలపై, సరికొత్త స్టాక్‌తో 66% వరకు తగ్గింపు ఇస్తున్నారు. కలంకారీ పట్టుచీర కొనుగోలుపై 2వ చీర రూ.49 మాత్రమే (రూ. 4,995 విలువైన) ఇస్తున్నారు. అన్ని రకాల లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్‌వేర్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తోంది. బంగారు ఆభరణాలపై ఈ ఆషాఢంలో ఎవ్వరూ ఇవ్వలేని, మరెప్పుడూ రాని సువర్ణావకాశం ప్రతి గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 2 గ్రాము ల వెండి ఉచితంగా ఇవ్వడం విశేషం.

కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై- ఫ్లాట్ రూ. 5,000 తగ్గింపు అందిస్తున్నారు. డైమండ్ ఆభరణాలపై రూ.49,990/- సీటీ అందిస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్‌లకు పెద్దసంఖ్యలో విచ్చేస్తున్న కొనుగోలుదారులు వివిధ కేటగిరీలకు చెందిన, వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న రకరకాల పట్టు చీరలను పవిత్ర ఆషాఢ పర్వదినాల సందర్భంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమ కస్టమర్లకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.