18-07-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): కొనుగోలుదారుల అభిరుచు లను అంచనా వేసి, వాటికి అనుగుణమైన అమ్మకాలు చేపట్టే ఆర్‌ఎస్ బ్రదర్స్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆషాఢమాసం సందర్భంగా మహిళలు, పురుషు లు, పిల్లలకు సంబంధించిన అనేక లక్షల వెరైటీ వస్త్రాలను ’సూపర్ ఆషాఢం కేజీ సేల్’ క్యాప్షన్‌తో అన్ని రకాల వస్త్రాలపై 70 శాతం వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తోంది.
దీంతోపాటు అలంకారీ ప్రింట్ శారీ కొనుగోలుపై 2వ చీర రూ.39లు మాత్రమే (రూ. 3,695 విలువైన) అందిస్తున్నారు. అన్ని రకాల లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ప్రతి 22 క్యారెట్ బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామ్‌కు ఫ్లాట్ రూ.200 తగ్గింపు ఇస్తున్నారు. పాత బంగారం ఎక్సేంజ్‌పై గ్రాము కు రూ.100 అదనంగా అందిస్తున్నారు.
దీంతోపాటు కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై - ఫ్లాట్ రూ.5,000 తగ్గింపు ఇవ్వడం విశేషం. నాణ్యతకు నాణ్యత.. తగ్గింపు ధరకు తగ్గింపు ధరలు విశేషంగా ఆకర్షించడంతో, ఆర్‌ఎస్ బ్రదర్స్ వారి షోరూమ్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తము ప్రకటించిన ఆఫర్లు కస్టమర్ల అభిమానం చూరగొనడంతో సంస్థ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.