calender_icon.png 18 July, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం

18-07-2025 12:00:00 AM

  1. మంత్రి పొంగులేటి 

ఇందిరా మహిళా శక్తి -తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి అర్థం:మంత్రి సీతక్క 

రూ. 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ

ఇల్లెందు, జులై 17 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు.

ఇల్లందు శాసనసభ్యులు కోరం కనక య్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమా చార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శా ఖల మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క), భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రా వు, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, ఎస్పీ రోహిత్ రాజు, ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ని టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం, కామేపల్లి, గార్ల మండలాలు, ఇల్లందు మున్సి పాలిటీ పరిధిలోని మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమా లు, ప్రభుత్వం మహిళల ఉన్నతికి ఇస్తున్న ప్రోత్సాహకాలను గురించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన వివరించా రు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల్లో చూపే ప్రభుత్వం. పేదలకు అండగా నిలబడే ఇందిరమ్మ పాల న ఇప్పుడు తిరిగి ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంది అని తెలిపారు. గత పాలకులు పావల వడ్డీ పథకాన్ని రద్దు చేసి, మహిళలకు ఆర్థికంగా కుదేలయ్యేలా చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గత 18 నెలల్లో రు.856 కోట్ల వడ్డీ మాఫీ చేసి లక్షలాది మహిళలను తిరిగి భరోసా కలిగే స్థితికి తీసుకొచ్చిందని వివరించారు.

ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకున్న ‘కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి’ అనే ఆలోచన కేవలం హామీ కాదు అది కార్యరూపం దాలుస్తోందని చె ప్పారు. ప్రజా ప్రభుత్వం తొలి 24 గంటల్లోనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయా ణం కల్పించిందని, నెలకు సగటున ప్రతి మహిళ రూ.25004000 ఆదా చేసుకునే స్థితి ఏర్పడిందన్నారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు మెరుగైన వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 5 లక్షల గృహనిర్మాణ సహాయం వంటి పథకాలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని మంత్రి వివరించారు.

రైతుల పట్ల ప్ర భుత్వం అంకితభావంతో పని చేస్తోందని, రైతుబంధు, పంట పెట్టుబడి సాయం, రూ. 21 వేల కోట్ల రుణమాఫీ, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల నిధుల జమ వంటి చర్యల ద్వారా రైతుల ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. నూతనంగా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు త్వరలోనే మరో 40 వేల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తం గా 4.5 లక్షల మంది అర్హులకు రూ.5 లక్షల మంజూరు జరిగిందని, కేవలం ఇల్లందు నియోజకవర్గానికే రూ.240 కోట్లు కేటాయించామని, ప్రతి సోమవారం ఫౌండేషన్ నుంచి గృహ ప్రవేశం వరకు ప్రభుత్వం ని ఖ్సాన చర్యలు తీసుకుంటోందని వివరించా రు. ఈ ప్రభుత్వం పేదలవారీది. ఇందిరమ్మ పేరు చెప్పగలిగే ప్రభుత్వం. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం. మహిళలకు గౌరవం, రైతుకు మద్దతు, యువతకు అవకాశాలు ఇవే మన పాలనకు గుర్తింపులు, అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధి సమాజ అభివృద్ధికి నిజమైన బలమ ని పేర్కొన్నారు. ఈ సృష్టికి మూలం అమ్మ. మహిళ లేకుండా ఒక్క ఇల్లు సుఖంగా ఉండ దు, ఒక్క ఊరు ఆనందంగా ఉండదు. అం దుకే మహిళను గౌరవించాలి, నిలబెట్టాలి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అని ఆ మె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ’ఇందిర మహిళ శక్తి’ పథకం తెలంగాణ మహిళలకు ఆర్థికంగా స్వావలంబనను అందించడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తోందని ఆమె తెలిపారు.

ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా మంజూరవుతున్న రు ణాలు, మహిళా సంఘాల ప్రోత్సాహంతో ఎంతోమంది మహిళలు తమ జీవితాల్లో వెలుగు చూస్తున్నారని వివరించారు. ఒకప్పు డు బట్టలు కొనేందికైనా వడ్డీకి డబ్బులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్న మన మహిళలు, నేడు స్వయం ఉపాధిలో రూ. 20, 000 నుంచి రూ. 30,000 వరకూ సంపాదిస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు. ఇది ఒక పెద్ద మార్పు, అని ఆమె అన్నారు.

సమాజంలో మహిళకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తేనే ఆమెను నిజమైన స్వతంత్ర భారత నాగరికురాలిగా పరిగణించవచ్చని సీతక్క వ్యాఖ్యానించారు. మహిళలకు చెందిన సం ఘాలు ఈ మార్పుకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయని, వాటిని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పా రు. సభ్యురాలిగా ఉన్న మహిళ మరణించిన సందర్భంలో, ఆమె కుటుంబంపై భారం పడకుండా లోన్ బీమా ద్వారా రుణాన్ని మాఫీ చేసేలా ఏర్పాటు చేయడం వల్ల వేల కుటుంబాలకు భరోసా కలుగుతోంది అని ఆమె వివరించారు.

గతంలో సభ్యత్వ పరిమి తి 18-60 వయస్సుతో ఉండేదని, కానీ ఇప్పుడైతే 60 ఏళ్లు దాటిన వారినీ మహిళా సం ఘాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ప్రభు త్వంలో 15-65 సంవత్సరాలు ఉన్న వారికి మహిళా సంఘాల్లో సభ్యత్వం కొరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. యువతుల్ని చిన్నప్పటి నుంచే సంఘాల్లో భాగస్వాములుగా చేసేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రతి మహిళా సంఘం ఒక అక్క లా, ఒక అమ్మలా ఉండాలి అని, ఒంటరి మ హిళలకు అండగా మహిళా సంఘాలు ఉం డాలన్నారు. భద్రాచలం మహిళలు తయారుచేసిన రాగిలడ్డు ప్రధానమంత్రికి నచ్చడం, ఆయన పొగడడం రాష్ట్రానికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల చేనేత చీరలు దుబాయ్ నుంచి కాదు, బొంబాయ్ నుంచి కాదు మన సొంత మహిళలు చేతి కార్మికతతో నేసినవి. వాటి పంపిణీ కార్యక్రమాలు త్వరలోనే చేపడతామన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే ఉచిత బస్సు సదుపాయం కల్పించడం మాత్రమే కాకుండా, బస్సులకు ఓనర్లను మహిళలుగా చేర్చి, ఓనర్లకు అద్దె డబ్బులు ఇవ్వడం, వందల కోట్ల రూపాయ ల రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరించడం, ఇవన్నీ మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి మహిళ కోటీశ్వరిగా మారాలని, ఆమె కుటుంబం సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదివి ఎదగాలని, మీ అందరి శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోం ది. మీరు సొంతగా సంపాదించి, అభిమా నం గా బతకాలి.

ఇదే సీఎం రేవంత్ రెడ్డి కల, ఇదే మా సంకల్పం అని మంత్రి అన్నారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే కాకుం డా వారిని సమాజాభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తుందన్నారు.

అనంతరం ఇల్లందు నియోజకవర్గ పరిధిలో బ్యాంకు లింకేజి 346 స్వయం సహాయక సంఘాలకు రూ.28.75 కోట్లు పంపిణి చేశారు. వడ్డీలేని రుణాలు 5995 స్వయం సహాయక సంఘాలకు రూ.4.85 కోట్లు,లోన్ భీమా, ప్రమాద భీమా 21 మంది సభ్యులకు రూ.19,84, 317, మహలక్ష్మీ పథకం కింద 5 మండలాలలో బస్సులకు రూ.3,47,340/- పంపిణి. (ఒక నెలకు EMI రూ.69,468/- చొప్పున) లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మహబూబాబాద్ డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈ ఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇల్లందు ఎంపీడీవో ధన్ సింగ్, డిఎస్‌ఓ రుక్మిణి, డిస్టి క్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లేనినా, తదితరులు పాల్గొన్నారు.