30-11-2024 06:50:57 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కౌటాల మండలం మొగఢ్ దగాడ్ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ను సస్పెండ్ చేయాలని యువజన సంఘాల నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ చేపట్టిన పాఠశాల తనిఖీలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు, పాడైన ఆలుగడ్డలు దర్శనమియ్యడంతో పాటు విద్యార్థులకు పప్పుకు బదులుగా నీళ్ల సాంబారు పెట్టడం జరిగిందని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలిపీ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టి ఏ జి ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులున్నారు.